ద్రవిడ్‌కు బీసీసీఐ సత్కారం

22/03/2012 10:52

 

కోహ్లీపై ఒత్తిడి పెంచవద్దు: సచిన్

 
 
 
 
 

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరదను సృష్టిస్తూ, ప్రత్యర్థి జట్టు బౌలర్లను గడగడలాడిస్తున్న యువ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెంచవద్దని సచిన్ అన్నారు. యువ క్రికెటర్లలో కోహ్లీ అత్తుత్తమ క్రీడాకారుడని సచిన్ కితాబిచ్చారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని.. అతనిపై ఎలాంటి ఒత్తిడి పెంచవద్దన్నారు. ఆసియాకప్ ఫైనల్ నుంచి భారత్ వైదొలగడంతో ఢాకా నుంచి సచిన్ స్వదేశానికి చేరుకున్నారు. తొంబై తొమ్మిది సెంచరీలు చేసిన తనకు 100 సెంచరీ చేయడం చాలా కష్టమైందన్నారు.

 
 
 

14 నుంచి అంతర్ జిల్లా అథ్లెటిక్స్

 
 
 
 
 

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: వచ్చేనెల 11 నుంచి హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జరగాల్సిన అంతర్ జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు వాయిదా పడ్డాయి. ఈ పోటీలను ఏప్రిల్ 14, 15వ తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్(ఏపీఏఏ) ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కె.రంగారావు తెలిపారు. పురుషుల, మహిళల, యూత్ అండర్-20 బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ పోటీల నుంచి జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ మీట్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తారు. హన్మకొండలో జరిగే అంతర్ జిల్లా అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనే జిల్లాల జట్లు ఏప్రిల్ 9లోగా తమ ఎంట్రీలను పంపించాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు ఏపీఏఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సారంగపాణి(93901-04499)ని సంప్రదించవచ్చు.

 

 
 

27న ద్రవిడ్‌కు బీసీసీఐ సత్కారం

 
 
 
 
 


ముంబై: కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. బాంద్రాలోని స్టార్ హోటల్లో ఈ నెల 27న అతడిని సన్మానించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలో భారత జట్టు సభ్యులు, మాజీ కెప్టెన్లు, ద్రవిడ్ కుటుంబసభ్యులు, ప్రస్తుత, మాజీ బోర్డు అధికారులు పాల్గొంటారని అందులో పేర్కొంది. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో వికెట్ల ముందు పెట్టని గోడలా, నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కిన ద్రవిడ్ ఈ నెల 9న టెస్టులకు రిటైర్మెంట్ చెప్పాడు.

 
 

టి-20 సిరీస్ కూడా ఆసీస్‌దే

 

భారత్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు టి20 సిరీస్‌నూ కైవసం చేసుకున్నారు.

 
 
 

విశాఖపట్నం, న్యూస్‌లైన్:  భారత్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు టి20 సిరీస్‌నూ కైవసం చేసుకున్నారు. బుధవారం ఇక్కడి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో భారత్ మహిళల జట్టుపై గెలిచి... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్ అలైసా హీలీ (61 బంతుల్లో 90, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగగా, మెగ్ లానింగ్ 42 పరుగులు చేసింది. 

ఇద్దరు తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించారు. తర్వాత 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 88 పరుగులే చేయగలిగింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవ్వగా, లోయర్ ఆర్డర్‌లో సులక్షణ నాయక్ 34, రీమా మల్హోత్రా 32 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు. కాయిట్ (3/19), పెర్రి (2/8) ధాటికి భారత్ ఒక దశలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.